మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (07:13 IST)

కమలా హ్యారీస్ హత్యకు కుట్ర.. రూ.39 లక్షలకు బేరం!

అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నింది. ఇందుకోసం రూ.39 లక్షలకు బేరం కూడా కుదుర్చుకుంది. ఈ కుట్ర పన్నింది కూడా ఓ మహిళే కావడం గమనార్హం. అయితే, యూఎస్ పోలీసులు చివరి నిమిషంలో అధికారులు ఆమె కుట్రను భగ్నం చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియేన్​ పెటిట్​ ఫెల్ప్స్​(39) అనే మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ను హత్య చేయాలని భావించింది. ఇందుకోసం ఆమె దుండుగులతో రూ.53 వేల డాలర్లకు (భారత కరెన్సీలో రూ.39 లక్షలు) డీల్ కుదుర్చుకుంది. 
 
అయితే, ఆమె కుట్రను యూఎస్ పోలీసులు ముందుగానే పసిగట్టి భగ్నం చేశారు. చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు గత వారం మియామీ ఫెడరల్​ కోర్టులో హాజరుపరిచారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరు సార్లు కమలా​ను తాను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు కోర్టులో నివియేన్ అంగీకరించింది. 
 
ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిని హత్య చేస్తానంటూ జైలులో ఉన్న తన భర్తకు తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలను సైతం పంపించిందని న్యాయవాదులు విచారణ సందర్భంగా తెలిపారు.