బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:34 IST)

మోదా గ్రామంలో వివాహితపై వైకాపా నేత అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఆగడాలు రోజురోజుకూ హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా, బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఏమాత్రం విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లాలోని పరిగి మండల పరిధి మోదా గ్రామంలో వివాహితపై వైసీపీ నేత అత్యాచారయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి మోదా గ్రామానికి ఇటీవల ఓ కుటుంబం వలస వచ్చింది. బుధవారం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా మహిళపై గ్రామానికి చెందిన వైసీపీ నేత కుమారుడు అరుణ్‌కుమార్.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆ కామాంధుడు నుంచి తప్పించుకునేందుకు వివాహిత బిగ్గరగా కేకలు వేసింది. ఈ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడు చేరుకుని ఇంటి తలుపులు బద్దలు కొట్టి మహిళను రక్షించారు. స్థానికులను చూడగానే అరుణ్‌కుమార్ అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.