ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (07:17 IST)

పిటీషనర్ల సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించండి: అనంతపురం జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లాలో స్పందనకు వచ్చే పిటీషనర్ల సమస్యలకు సత్వరమే స్పందించి సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 140 పిటీషన్లు స్వీకరించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో స్పందన నిర్వహించారు. పిటీషనర్లకు సౌకర్యవంతంగా ఉండేలా సీటింగ్ , తదితర ఏర్పాట్లు చేశారు.  పిటీషనర్ల బాధలు, సమస్యలను జిల్లా ఎస్పీ సమగ్రంగా విన్నారు.

పిటీషనర్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలా...  జిల్లా నలమూలల నుండీ విచ్చేశారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, రస్తా వివాదాలు, ఉద్యోగ మోసాలు, సైబర్ మోసాలు, భూవివాదాలు... ఇలా తమకున్న సమస్యలను ఎస్పీ ముందు స్వేచ్ఛగా విన్నవించారు.

పోలీసు పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా వేళ.... మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ... శ్యానిటైజర్ అందుబాటులో ఉంచారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నాగేంద్రుడు, ఎస్బీ డి ఎస్ సి ఉమా మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.