శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:51 IST)

ఆరేళ్ళ చిన్నారి అత్యాచార ఘటనపై కోమటిరెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు.. మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
చిన్నారిపై దారుణానికి ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేని చదువుపై ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు శ్రద్ధ చూపకపోపవడంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన కూడా అందులో భాగమేనన్నారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ నిందితుడి ఆచూకీ తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు.