మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరాచీలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం

dawood ibrahim
భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక సమాచారాన్ని వెల్లడించింది. వందలాది మంది పౌరుల మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ పాకిస్థాన్‌లో ఉన్నాడని నిర్ధారించబడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కథనం ప్రకారం, దావూద్ మేనల్లుడు అలీసా పార్కర్ తన మామ ఇంకా కరాచీలోనే ఉన్నాడని పేర్కొన్నట్టు తెలిపింది. 
 
ఈడీ అధికారుల కథనం మేరకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన విచారణలో అలీసా పార్కర్ వెల్లడించిన తర్వాత ఈడీ అధికారులు ఈ పురోగతి సాధించారు. అయితే, దావూద్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని హసీనా పార్కర్ (దావూద్ సోదరి) కుమారుడు అలీసా పార్కర్ ముంబైలోని కోర్టులో వాదిస్తూ చార్జిషీట్‌లో నమోదు చేశారు.