గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (15:29 IST)

అమెరికాలో అల్లరి మేక ఏం చేసిందో చూడండి (వీడియో)

అమెరికాలో ఓ మేక తన కొమ్ముల శక్తేంటో చూపింది. తన కొమ్ముల బలం ఏంటో చూపించింది. అమెరికాలోని కొలరెడోలో గల ఆర్గొనిక్స్ కంపెనీ ప్రవేశ ద్వారాన్ని ఓ మేక కొమ్ములతో గుద్ది పగులకొట్టి పారిపోయింది. అంతటితో ఆగకుండ

అమెరికాలో ఓ మేక తన కొమ్ముల శక్తేంటో చూపింది. తన కొమ్ముల బలం ఏంటో చూపించింది. అమెరికాలోని కొలరెడోలో గల ఆర్గొనిక్స్ కంపెనీ ప్రవేశ ద్వారాన్ని ఓ మేక కొమ్ములతో గుద్ది పగులకొట్టి పారిపోయింది. అంతటితో ఆగకుండా మళ్లీ వచ్చి మిగిలిన ఆఫీసు అద్దాలను కూడా పగుల కొట్టేసింది. అద్దాలు పగిలిపోవడాన్ని గమనించిన ఆఫీసు సిబ్బంది.. దొంగతనం జరిగివుంటుందేమోనని జడుసుకున్నారు. 
 
అంతే సీసీ కెమెరా ఫుటేజీలను చూడటం ప్రారంభించారు. అయితే అసలు విషయం సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. తీరా చూసేస‌రికి ఒక మేక‌పోతు అద్దాలు ప‌గ‌ల‌గొట్టింద‌ని తెలిసి న‌వ్వుకున్నారు. వెంటనే ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను మీరూ చూసి ఆనందించండి..