శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:15 IST)

సెల్ఫీలకు ఫోజివ్వడం మాకు తెలియదా? గొరిల్లాలు క్యూట్ ఫోజ్

మనుషులకేనా సెల్ఫీలకు ఫోజివ్వడం తెలుసు. ఏం మాకు తెలియదా అంటూ ఫోజిచ్చాయి.. గొరిల్లాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఇంతకీ విషయం ఏమిటంటే? కాంగోలోని విరుంగ నేషనల్  పార్కులో చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న రెండు ఆడ గొరిల్లాలు వచ్చాయి. అప్పటి నుంచి పార్క్ సంరక్షుల చేతిలో పెరిగాయి. 
 
ఈ క్రమంలో మాథ్యూ శామూవు అనే జంతు సంరక్షుడు ఇటీవల వాటితో ఓ ఫోటో దిగాడు. ఈ ఫోటోకు షేర్లు వెల్లువెత్తుతున్నాయి. డకజీ, డేజ్ అనే పేర్లతో పిలవబడే ఈ ఆడ గొరిల్లాలు ఫొటోకు ఇచ్చిన పోజ్‌ అందరికీ తెగ నచ్చేసింది. 
 
ముఖ్యంగా మాథ్యూ శామూవుకు వెనకవైపు నిల్చుని వున్న డేజ్ అనే గొరిల్లా అచ్చు మనిషిలాగే చేయడంపై నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోపై పార్క్ యాజమాన్యం సోషల్ మీడియాలో స్పందించింది. ఈ రెండు గొరిల్లాలు చాలా చలాకీగా వుంటాయని.. వాటి వ్యక్తిగత జీవితానికి ఈ ఫోటో నిదర్శనమేనని పేర్కొంది.