శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (19:25 IST)

ఆఫ్ఘనిస్తాన్‌లో గుప్త నిధులు-తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ?

తాలిబన్ల దౌర్జన్యానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌ జ్వాజియన్‌ ప్రావిన్స్‌‌లో తిల్యాతోపే అనే ప్రాంతం‌లో పెద్ద ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్‌ యూనియన్‌ ఆధీనంలో ఆఫ్ఘానిస్తాన్‌ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు.
 
ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి బయటపడ్డాయి. ఇవి క్రీస్తూ పుర్వం 1 వ శతాబ్దానికి చెందినవిగా అప్పటి పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో చాలా వరకు అప్పటి సోవియట్‌ యూనియన్‌ చేతికి చిక్కాయి.
 
మిగిలిన వాటిని ఆఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం జాగ్రత్తగా భద్రపరుస్తూ.. వస్తోంది. అయితే.. ఆ విలువైన సంపద ఎక్కడ తాలిబన్ల వశం అవుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. 1994 లో ఈ సంపదను తాలిబన్ల వశం కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే.. ఇప్పుడు తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.