సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:10 IST)

భారత్ - చైనాల మధ్య యాప్‌ల నిషేధం వార్

భారత్, చైనా దేశాల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణాత్మక వైఖరి కనిపిస్తూనే వుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల సైనికులు సరిహద్దుల వెంబడి ఘర్షణ పడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. 
 
దీంతో భారత్ భద్రతాపరంగా హాని కలిగించే చైనాకు చెందిన అనేక వెబ్‌సైట్లను నిషేధిస్తున్నాయి. ఇటీవల కూడా 54కి పైగా వెబ్‌సైట్లపై నిషేధం విధించాయి. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరిపట్ల భారత్ ఒకే రీతిలో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
 
కొందరిపైనే వివక్ష చూపించడం తగదని, పారదర్శక రీతిలో సరైన పంథాను అనుసరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హితవు పలికారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం, వ్యాపార సహకారం కోసం భారత్‌ దృఢమైన విధానం అవలంభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.