మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (10:58 IST)

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌

hyd-metro
ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం తన ఎంబీఐ విద్యార్థులు, ప్రొఫెసర్‌ల కోసం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను ఒక కేస్ స్టడీగా చేర్చింది. తద్వారా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ఇది భారతీయ సంస్థకు దక్కిన అరుదైన గౌరవంగా అభివర్ణించింది.
 
ప్రపంచ వ్యాప్తంగా వివిధ భారీ-స్థాయి ప్రాజెక్టుల అమలు సమయంలో ఎదురయ్యే సవాళ్లు, ఈ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు, పరిష్కారాలను జర్నల్ కవర్ చేస్తుంది. 
 
ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్‌లు రామ్ నిడుమోలు, అతని బృందం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై అధ్యయనం నిర్వహించింది. దీనిని విశ్వవిద్యాలయం ఇప్పుడు కేస్ స్టడీగా ప్రచురించింది.
 
ప్రాజెక్టును విజయవంతం చేయడంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.