బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (16:20 IST)

మూన్ ట్రిప్‌కు ఎంపికయ్యాడు.. గర్ల్‌ఫ్రెండ్ కోసం అన్వేషించాడు.. 8మంది కావాలట!

జపాన్ బిలియనీర్ యుసకూ మెజావా .. చంద్రుడి వద్దకు వెళ్లేందుకు స్పేస్ఎక్స్ వద్ద టికెట్ బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఎలన్ మస్క్‌కు చెందిన సంస్థ.. ప్రైవేటు వ్యక్తులను మూన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆ ట్రిప్ కోసం 2018లోనే జపాన్ వ్యాపారవేత్త మెజావా టికెట్‌ను కొనేశారు. మొత్తం టికెట్లను బుక్ చేసుకున్న మెజావా.. ఇప్పుడు మరో ఎనిమిది మంది కోసం ఆహ్వానం పంపారు. 
 
వివిధ రకాల బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లు తనతో జర్నీకి రావాలన్న ఆసక్తిని ఆయన కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మంగళవారం తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చంద్రుడి చుట్టూ తిరిగి రావాలనుకుంటున్నవారు కళాకారులై ఉండాలని, మీరు ఆ కళాకారులైతే దరఖాస్తు చేసుకోవాలంటూ ఆయన ఆ ట్వీట్‌లో కోరారు.
 
ఆ జర్నీకి అయ్యే మొత్తం ఖర్చును తానే భరించనున్నట్లు చెప్పారు. ఉచితంగానే మూన్ చుట్టు చక్కర్లు కొట్టిరావచ్చు అంటూ తన వీడియోలో మెజావా పేర్కొన్నాడు. డియన్‌మూన్ పేరుతో 2023లో స్పేస్ఎక్స్ సంస్థ ఈ మిషన్ చేపట్టనుంది. అన్ని సీట్లు తానే కొన్నానని, తమ ప్రయాణం ప్రైవేటుదే అవుతుందని అన్నాడు. మూన్ ట్రిప్‌కు ఎంపికైన తర్వాత మెజావా.. గర్ల్‌ఫ్రెండ్ కోసం అన్వేషించాడు. 
 
ఆ తర్వాత తన ప్రయత్నాలను విరమించుకున్నాడు. చంద్రుడి పర్యటనకు వెళ్లాలనుకున్న మెజావా తన ట్రిప్ కోసం ఎంత మొత్తాన్ని చెల్లించాడో వెల్లడించలేదు. కానీ భారీ స్థాయిలో అతను డబ్బులు ఇచ్చినట్లు మస్క్ తెలిపాడు.