సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (11:37 IST)

జెలెన్ స్కీ కీలక నిర్ణయం... నాటోతో కలిసేది లేదు.. రష్యాతో చర్చలు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు దాదాపు 1.5 మిలియన్ల మంది చిన్నారులు దేశం విడిచి నుంచి బలవంతంగా తరలి వెళ్లారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి నిమిషానికి దాదాపు 55 మంది పిల్లలు.. ప్రతి సెకనుకు దాదాపుగా ఒక పిల్లవాడు శరణార్థిగా మారుతున్నాడు.
 
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరో 30 రోజుల పాటు మార్షల్ లా పొడిగించేలా బిల్లు ప్రవేశపెట్టారు. రిజర్వ్ బలగాల కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు జెలెన్ స్కీ. అలాగే జెలెన్ స్కీ కూడా యుద్ధం ఆపేందుకు నాటోతో కలిసేది లేదంటూ రష్యాతో కంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
రష్యా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరుల తరలింపునకు 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది ఉక్రెయిన్‌. మరోవైపు వనరుల కొరతతో రష్యా సేనలు దాడులను విరమించుకునే పరిస్థితి రానుందని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ యూరప్‌ మాజీ కమాండింగ్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బెన్‌ హోగ్స్‌ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా యుద్ధం ఆపేందుకు నాటోతో కలిసేది లేదంటూ రష్యాతో కంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.