1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:45 IST)

భారత్‌లో జిన్ పింగ్ పర్యటన: చైనా బలగాలు కుటిల బుద్ధి!

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. బుధవారం గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు చేరుకున్న ఈయన మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు చైనా బలగాలు తన కుటిల బుద్ధిని ప్రదర్శించాయి. ఆ దేశాధ్యక్షుడు స్నేహ హస్తం చాస్తుండగా, అక్కడి సైన్యం కయ్యానికి కాలుదువ్వడం గమనార్హం. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ సెక్టార్‌ చుముర్ ప్రాంతంలో చైనా సైన్యం అతిక్రమణకు పాల్పడింది. సుమారు వంద మంది వరకు చైనా సైనికులు భారత భూభాగంలోకి హద్దుమీరి ప్రవేశించి తిష్ట వేశారు. ఈ విషయం తెలుసుకున్న భారత బలగాలు వారిని వెనక్కి తిరిగి వెళ్లమని హెచ్చరించినా వారు మిన్నకుండి పోయారు. ఈ సైనికులను నిలువరించేందుకు భారత్ ఐటీబీపీ సిబ్బందితో పాటు.. ఇతర బలగాలను సైన్యం మొహరించింది.