ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:51 IST)

భారతీయులారా స్వదేశానికి వచ్చేయండి: కేంద్రం

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్‌ను వీడాలని భారత ప్రభుత్వం చెబుతోంది. 
 
ఆఫ్ఘన్‌లో హింస క్రమంగా పెచ్చరిల్లుతోందని, త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆలోపే భారత పౌరులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ఆఫ్ఘనిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ఉన్న భారతీయులను కూడా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకనే భారత ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్లను తిరిగి వచ్చేయాల్సిందిగా కోరుతూ ఉంది.