కొండచిలువను మింగిన కోతి: కదల్లేని స్థితిలో..?
పది అడుగుల కొండచిలువ కోతిని మింగి కదల్లేని స్థితిలో అటవీ శాఖ అధికారుల కంటపడింది. గుజరాత్‌లోని వడోదర సమీపంలో గల చిన్న నదిలో కొండచిలువను గుర్తించిన అధికారులు దానిని బయటకు తీశారు.
ఒడ్డుకు తెచ్చిన కొద్దిసేపటికే కడుపులో ఉన్న కోతిని వాంతుల ద్వారా బయటపడేసింది. అప్పటివరకు కదల్లేని స్థితిలో ఉన్న కొండచిలువ కోతిని బయటవేయగానే అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది.
ఇదే సమయంలో దాని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అధికారులు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు.