శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (08:01 IST)

జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర సక్సెక్స్... నింగిలో కొన్ని నిమిషాలపాటు..

ప్రపంచ కుబేరుడు అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ మరో ముగ్గురుతో కలిసి చేపట్టిన తొలి అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. నలుగురు సభ్యులను మోసుకుంటూ నింగికి ఎగిసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక విజయవంతంగా రోదసిలో ప్రవేశించింది. అక్కడ కొన్ని నిమిషాలు గడిపిన అనంతరం బెజోస్ బృందం స్పేస్ కాప్స్యూల్ సాయంతో సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. 
 
ఈ స్పేస్ కాప్స్యూల్ పారాచూట్ల సాయంతో ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా ఎడారి ప్రాంతంలో సురక్షితంగా దిగింది. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమనౌక... రోదసీలో కొన్ని నిమిషాలు ఉండిన తర్వాత తిరిగి భూమికి సురక్షితంగా తిరిగివచ్చింది. పశ్చిమ టెక్సాస్‌ నుంచి రోదసీలోకి బయల్దేరిన బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్‌ క్రాఫ్ట్.. తిరిగి 11 నిమిషాల్లో భూమికి చేరుకుంది. 
 
సాధారణ మనుషులు కూడా అంతరిక్ష యాత్రలు చేయాలన్న ఉద్దేశంతోనే బెజోస్‌ ఈ యాత్రను చేపట్టినట్లుగా బ్లూ ఆరిజన్‌ సంస్థ వెల్లడించింది. ఈ యాత్రలో బెజోస్ తో పాటు 82 ఏళ్ల మహిళా పైలెట్ వేలీ ఫంక్ కూడా పాల్గొని, రోదసియాత్ర చేసిన పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.