ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (17:38 IST)

జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా: పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్!

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానాను విధిస్తూ లాస్ ఏంజిల్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన పౌడర్‌ను చాలాకాలం ఉపయోగించడం ద్వారా ఓ మహిళకు అండాశయ క్యాన్సర్ వచ్

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానాను విధిస్తూ లాస్ ఏంజిల్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన పౌడర్‌ను చాలాకాలం ఉపయోగించడం ద్వారా ఓ మహిళకు అండాశయ క్యాన్సర్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బాధితురాలు ఎచివెరియా కోర్టుకెక్కడంతో కోర్టు ఆమెకు 417 మిలియన్ల డాలర్లు.. భారత కరెన్సీలో రూ.2700 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బేబీ టాల్కర్ పౌడర్ వాడటం వల్లే ఈవా ఎచివెరియా అనే మహిళకు అండాశయ క్యాన్సర్ సోకిందని కోర్టు నిర్ధారణకు వచ్చింది. టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల తలెత్తే కేన్సర్ ఇబ్బందుల గురించి సదరు సంస్థ ఏ మాత్రం పట్టించుకోవట్లేదని బాధితురాలు ఆరోపించింది. 
 
ఇంకా ఈ పౌడర్ వాడటం వల్లే తన క్లయింట్ ఈ వ్యాధి బారిన పడిందని, ఇలాంటి నష్టం ఇతరులకు జరగకూడదనే ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించినట్లు ఎచివెరియా తరపు న్యాయవాది మార్క్ రాబిన్ సన్ తెలిపారు. అయితే ఈ తీర్పు పట్లు జాన్సన్ కంపెనీ అప్పీలు చేసేందుకు సిద్ధమైంది. ఎచువెరియాకు చేసే ఆరోపణలకు తగిన శాస్త్రీయ పరమైన ఆధారాలు లేవని జాన్సన్ సంస్థ అధికారులు వెల్లడించారు.