1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (19:59 IST)

కిమ్ ప్రసంగిస్తుంటే వైద్యులు కంటతడి పెట్టారు.. ఎందుకంటే?

Kim Jong un
Kim Jong un
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగిస్తుంటే.. వైద్యులు కంటతడి పెట్టుకున్నారు. చిన్నపిల్లల్లా వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా సమయంలో కీలక సేవలు అందించిన ఆర్మీ వైద్యులను సన్మానించేందుకు రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ ఓ భారీ సభ ఏర్పాటు చేశారు. 
 
ఈ సభలో కిమ్ ప్రసంగిస్తుండగా ఆర్మీ వైద్యులు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించారు. వారు అలా కన్నీళ్లు పెట్టుకోవడం వెనక కారణం ఉంది. కరోనాను జయించామని కిమ్ ప్రకటించిన తర్వాత ఈ బాధ్యతల నుంచి ఆర్మీ వైద్యులకు విముక్తి కల్పించింది. 
 
కిమ్ సహా వందలామంది కీలక అధికారులు, మిలటరీ వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బంది దీనికి హాజరయ్యారు. కిమ్ ప్రసంగిస్తూ వారి సేవలను కొనియాడారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ ప్రశంసలు కురిపించారు. 
 
కరోనాపై పోరులో ఉత్తర కొరియా సాధించిన విజయం అద్భుతమని వ్యాఖ్యానించారు. అది విన్న మిలటరీ వైద్యులు, ఇతర అధికారులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.