మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (14:24 IST)

సంప్రదాయానికి ముగింపు పలుకనున్న బ్రిటన్ రాజు చార్లెస్-3

charless
కొన్ని శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలకలాని బ్రిటన్ రాజు చార్లెస్ ఓ నిర్ణయానికి వచ్చారు. పట్టాభిషేకం సమయంలో రాజు దుస్తులు ధరించాల్సివుంది. అయితే, ఈయన మాత్రం ఈ దఫా ఆర్మీ దుస్తులు ధరించాలన్న నిర్ణయం తీసుకున్నారు. పట్టుతో తయారు చేసిన రాజ వస్త్రాలకు బదులు ఆర్మీ యూనిఫాం ధరించనున్నారు. అలాగే, బ్రిటన్ రాజుగా మే నెల 6వ తేదీన చార్లెస్-3కు పట్టాభిషేకం జరుగనుంది. 
 
లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఆ తర్వాత రోజున విండర్స్ క్యాజిల్‌లో లోకూడా మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆహ్వానిస్తారు. క్వీన్ ఎలిజబెత్-2 గత యేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆమె ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ రాణిగా కొనసాగారు. ఆమె మరణానంతరం చార్లెస్-3 రాజుగా బాధ్యతలు స్వీకరించారు.