లిబియాలో విమానం హైజాక్... 118లో 100 మందిని విడిచిపెట్టారు... ఇంజిన్ ఆడుతూనే ఉంది...
118 మందితో ప్రయాణిస్తున్న ఆఫ్రిక్వీయ్ ఎయిర్ లైన్స్ విమానం లిబియాలో హైజాక్ అయ్యింది. సబ ఎయిర్ పోర్ట్ నుంచి ట్రిపోలి వెళ్తుండగా విమానాన్ని ఇద్దరు ఆగంతకులు హైజాక్ చేశారు. చేతుల్లో గ్రేనేడ్లు పట్టుకుని విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. దీనితో విమానాన
118 మందితో ప్రయాణిస్తున్న ఆఫ్రిక్వీయ్ ఎయిర్ లైన్స్ విమానం లిబియాలో హైజాక్ అయ్యింది. సబ ఎయిర్ పోర్ట్ నుంచి ట్రిపోలి వెళ్తుండగా విమానాన్ని ఇద్దరు ఆగంతకులు హైజాక్ చేశారు. చేతుల్లో గ్రేనేడ్లు పట్టుకుని విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. దీనితో విమానాన్ని లిబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
హైజాకర్లు తాము గడాఫీ మద్దతుదారులమని చెప్పి అధికారుల ముందు తమ డిమాండ్లు ఉంచారు. వాటిని పరిష్కరిద్దామనీ, ప్రయాణికులను విడిచిపెట్టాల్సిందిగా అధికారులు చెప్పడంతో విమాన సిబ్బందిని తప్ప ప్రయాణికులందరినీ వదిలిపెట్టినట్లు సమాచారం. ఐతే విమానం ఇంజిన్ మాత్రం ఆపవద్దని హైజాకర్లు పైలెట్ పైన తుపాకి గురిపెట్టి ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు విమానాశ్రయాన్ని భద్రతాధికారులు చుట్టుముట్టారు.