శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (16:52 IST)

పొంచివున్న మరో వైరస్ ముప్పు.. ఘనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

marburg
ప్రపంచానికి మరో వైరస్ ముప్పు పొంచివుంది. "మార్‌బర్గ్" పేరుతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఘనాలో వేగంగా ఈ వైరస్ వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్‌ను అమలు చేస్తుంది. కొత్త వైరస్ ఉనికిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తుంది. 
 
పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. దీనికి మార్‌బర్గ్‌గా పేరు పెట్టారు. అయితే, ఘనాలో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి, ముప్పును అంచనా వేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. పైగా, ఈ వైరస్ ఎంతో ప్రాణాంతకమని తెలిపింది. 
 
ఈ వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, వారి రక్తంతో పాటు ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగులు పడుకున్న ప్రదేశంలో పడుకోవడం వల్ల, వారి దుస్తులను వేసుకోవడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుందని హెచ్చరించింది. వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల వల్ల కూడా ఈ వైరస్ అంటుంకుంటుందని  వెల్లడించింది. 
 
గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించిందని తేల్చి చెప్పింది. వైరస్ బాధితులు తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధపడుతుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. శరీరంలో అంతర్గతంగాను, బహిర్గతంగానూ రక్తస్రావం జరుగుతుందని చెప్పారు. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాని, చికిత్సలో జాప్యం జరిగితే మనిషి ప్రాణానికే ముప్పు అని చెప్పారు.