గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (12:27 IST)

పర్యాటకుల ఆకర్షణే ధ్యేయంగా సులభతర వీసా విధానం : సింగపూర్ పర్యాటక బోర్డు

stb sridhar
భారత్‌తో పాటు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ పర్యాటక బోర్డు (ఎస్టీబీ) సులభతరమైన వీసా విధానాన్ని అమలు చేస్తుంది. కేవలం రూ.1800 ఖర్చుతో ఈ వీసాను మూడు రోజుల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని భారత్, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ జీబీ శ్రీధర్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి తర్వాత సింగపూర్ టూరిజం బోర్డు ప్రయాణ వాణిజ్య భాగస్వాములతో పునరుద్ధరణ కార్యక్రమాలను వేగవంతం చేసిందని తెలిపారు. ఇందుకోసం భారతీయ పర్యాటకులను అమితంగ ఆకర్షించేందుకు వీలుగా ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను రూపొందించాసమన్నారు. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 13వ తేదీ నుంచి సింగపూర్‌కు వచ్చే భారతీయ ప్రయాణికుల కోసం అన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు, అన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షల నిబంధనలు ఎత్తివేసినట్టు తెలిపారు. అలాగే, సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కూడా ఈ తరహా ఆంక్షలను భారత ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. తాము కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇది సింగపూర్‌కు వచ్చే భారతీయ సందర్శకులకు ఎఁతో సౌకర్యంగా ఉంటుందన్నారు. వారి ప్రయాణాన్ని మరింత సులభతరం, సుఖమయం, సంతోషకరం చేస్తుందని తెలిపారు. 
 
గత 2022లో తమ దేశానికి మొత్తం 6.3 మిలియన్ల గ్లోబల్ సందర్శకులు రాకపోకలు సాగించగా, వీరిలో భారతదేశం 686,000 మంది వచ్చారని తెలిపారు. ఆ తర్వాత స్థానంలో ఇండోనేషియా (1.1 మిలియన్ల సందర్శకులు) ఉందన్నారు. సింగపూర్ నుంచి 17 భారతీయ నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీతో విమాన సర్వీసులు ఉన్నాయని చెప్పారు.
sridhar stb
 
'రింపింగ్ అప్ పాత్‌వేస్ టు రికవరీ, టుగెదర్!' అనే థీమ్ ఈ ప్రయాణాన్ని సులభరతం చేసినట్టు చెప్పారు. 2023తో పాటు రాబోయే సంవత్సరాల్లో ఎస్టీబీ విజన్ సింగపూర్‌ను ఒక గమ్యస్థానంగా ఉంచడంపై దృష్టి సారించింది, ఇది భారతీయ ప్రయాణికులకు దాని ఆకర్షణను విస్తృతం చేయడం ద్వారా రివార్డింగ్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని వెల్లడించారు. 
 
అలాగే, భారత్ వ్యాప్తంగా మొత్తం 37 సింగపూర్ ట్రావెల్ పరిశ్రమ భాగస్వాములు ఇక్కడ ఉన్న మా భాగస్వామి-స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి చెన్నైలో ఉన్నారు, ఇది అతిపెద్ద సింగపూర్ టూరిజం వాటాదారుల కలయికగా మారింది. భారతదేశం చాలా కాలంగా సింగపూర్ యొక్క అతిపెద్ద పర్యాటక వనరుల మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. 2023లో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 
 
2019లో సాధించిన దాదాపు 50 శాతం సందర్శకుల రాకపోకల్లో 2022లో బలమైన పునరుద్ధరణతో ఇది బలంగా ఉంది. సింగపూర్‌లో రాబోయే సంవత్సరం ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న పర్యాటక అభివృద్ధితో పాటు విభిన్నమైన అభిరుచి పాయింట్లు, ప్రయాణ కోరికలు మరియు ఆకాంక్షలు కలిగిన అనేక మంది భారతీయులను మా వైవిధ్యమైన, శక్తివంతమైన, పునర్నిర్మించిన ఆఫర్‌లను ఆస్వాదించడానికి మేము ఆహ్వానిస్తున్నాం అని వివరించారు.