మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో మారణ కాండ.. 60 మంది మృతి
మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రదాడిలో 60 మందికి పైగా మరణించారని రష్యాలోని పరిశోధనాత్మక కమిటీ (ICR) పేర్కొంది. ఈ ఉగ్రవాదుల దాడిలో 60 మందికి పైగా మరణించగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
మూడు నుండి ఐదుగురు గుర్తుతెలియని ముష్కరులు, అసాల్ట్ రైఫిల్స్‌తో శుక్రవారం మాస్కో మాల్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కనీసం 40 మంది కాల్చి చంపబడ్డారు. 100 మందికి పైగా గాయపడ్డారు. కచేరీ హాలులో మంటలు చెలరేగాయి.
క్రోకస్ సిటీ మాల్ మారణకాండపై దర్యాప్తు జరుగుతోంది. నగర సరిహద్దుకు వెలుపల ఉన్న మాస్కో ప్రాంతంలో ఉన్న మాల్‌పై రాత్రి 8 గంటల సమయంలో దాడి జరిగింది. భవనానికి నిప్పు పెట్టడానికి హ్యాండ్ గ్రెనేడ్లను ఉపయోగించినట్లు కూడా దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనా స్థలంలో సాయుధ పోలీసు స్పెషల్ ఆపరేషన్ యూనిట్లు ఆ ప్రదేశంలో మోహరించారు. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు.