గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (12:44 IST)

కరోనా దెబ్బ : మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా

కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందాల పోటీలో పాల్గొంటున్న పలువురు ముద్దుగుమ్మలు కరోనా బారిన పడటంతో ఈ పోటీలు వాయిదా పడ్డాయి. ఫైనల్స్ ఈవెంట్ ప్రారంభం అయ్యేందుకు కొన్ని గంటల ముందు మిస్ వరల్డ్ నిర్వాహకులు ఈ ప్రకటన చేశారు.  
 
ఇక ప్యూర్టోరికోలో ఫైనల్స్ జరగాల్సి ఉంది. కంటెస్టెంట్లందరూ ప్యూర్టోరికోలో ఐసొలేషన్‌లో ఉన్నారు. కరోనా బారిన పడుతున్న కంటెస్టెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు అధికారక ప్రకటన ద్వారా నిర్వాహకులు వెల్లడించారు. 
 
90 రోజుల వ్యవధిలో ప్యూర్టోరికోలో ఫైనల్స్ నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు, స్టాఫ్ మెంబర్లు కరోనా బారిన పడ్డారు. వారికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.