అవినీతి కేసులో అంగ్ సాన్ సూకీ ఐదేళ్ళ జైలుశిక్ష
మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీ ఓ అవినీతి కేసులో దోషిగా తేలారు. దీంతో ఆ దేశ కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలుశిక్షను విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది.
ఈమె రూ.6 లక్షల డాలర్లను నగదు, బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు మయన్మార్ జుంటా కోర్టు తీర్పునిచ్చింది. సూకీపై మయన్మార్ సైనిక ప్రభుత్వం ఏకంగా 11 అవినీతి కేసులు బనాయించిన విషయం తెల్సిందే.
ఈ కేసుల్లో ఒక్కోదానిలో ఆమె దోషిగా తేలితే గరిష్టంగా 15 యేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశాలు ఉన్నాయి. కాగా, మొత్తం 11 అవినీతి కేసుల్లో విచారణ పూర్తయిన తొలి అవినీతి కేసు ఇదే కావడం గమనార్హం. ఈ కేసు విచారణ కేవలం నాలుగు గోడల మధ్యే సాగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా ఆ దేశ అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.