శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (20:07 IST)

మానవత్వంతో వ్యవహరించిన సుప్రీం.. మరణశిక్షను అలా తగ్గించింది

supreme court
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఓ దోషిపై సుప్రీంకోర్టు మానవత్వంతో వ్యవహరించింది. కింది కోర్టు అతనికి విధించిన మరణ శిక్షను తగ్గించింది.
 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, బేలా ఎం. త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నేరస్థులకు విధించే ఉరి శిక్ష ప్రతి సందర్భంలోనూ నిర్ణయాత్మక అంశం కాదని ధర్మాసనం పేర్కొంది.
 
''దోషిపై అభియోగాలు మోపిన నేరాలపై దిగువ న్యాయస్థానాలు తీసుకున్న అభిప్రాయాన్ని ధృవీకరిస్తూ, శిక్షార్హమైన ఈ నేరానికి మరణ శిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం సరైనదని భావిస్తున్నాం." అంటూ పేర్కొంది. జీవితాంతం జైలు శిక్షకు బదులుగా 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం సముచితమని కోర్టు తెలిపింది. 
 
కానీ  376A, POCSO చట్టం కింద ఇతర నేరాలకు సంబంధించి దిగువ కోర్టులు నమోదు చేసిన నేరారోపణలు, శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అవుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.'' అని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
 
ఫిరోజ్ అనే వ్యక్తి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేశాడనే నేరంపై జిల్లా కోర్టు అతనికి మరణ శిక్షను విధించింది. ఐపీసీ సెక్షన్ 302 కింద నేరం చేసినందుకు నిందితుడు ఫిరోజ్‌కి మరణ శిక్షతో పాటు ఏడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.