742 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో విచారణలు  
                                       
                  
				  				   
				   
                  				  దేశంలో కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత సుప్రీంకోర్టు కోర్టులో భౌతిక విచారణలను నిలిపివేశారు. కేవలం వర్చువల్ విధానంలోనే సాగుతూ వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. దీంతో ఈ నెల 4వ తేదీ నుంచి పూర్వపు విధానంలోనే భౌతిక విచారణలు (ముఖాముఖి) విచారణలు ప్రారంభంకానున్నాయి. 
				  											
																													
									  
	 
	మొత్తంమీద 742 రోజుల పాటు కొనసాగిన ఆన్‌లైన్ విచారమలలకు నాలుగో తేదీతో ముగింపు పడనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్వయంగా ఈ ముఖాముఖి విచారణలపై ఓ ప్రకటన చేశారు. 
				  
	 
	"వచ్చే సోమవారం నుంచి పూర్తిస్థాయి భౌతిక విచారణలు మొదలవుతాయి" అంటూ పేర్కొన్నారు. 2020 మార్చి 23వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో కరోనా వైరస్ కారణంగా భౌతిక విచారణలు నిలిచిపోయిన విషయం తెల్సిందే. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అయితే, ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చక్కబడటంతో న్యాయమూర్తులు రవణ, లలిత్, ఏఎం ఖాన్ విల్కర్, వీడే చంద్రచూడ్, ఎల్ఎన్ రావులు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, బార్ అసోసియేషన్ ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.