సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (12:23 IST)

మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా 25 మంది మృత్యువాత

మయన్మార్ దేశంలో సైనికులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సాగుతున్న సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమకారులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ కారణంగా చెలరేగిన ఘర్షణల్లో 25 మంది మృత్యువాతపడ్డారు. 
 
మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని కాలరాసి జుంటా సైన్యం పెత్తనం సాగిస్తోంది. ఈ సైనిక చర్యకు వ్యతిరేకంగా సెంట్రల్‌ మయన్మార్‌లో జరిగిన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 25 మంది మృతి చెందారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో యాంటీ జుంటా ఉద్యమకారులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, పాలనా పగ్గాలు చేపట్టిన జుంటా సైన్యం.. నిత్యం తుపాకుల మోత మోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. 
 
ఇప్పటివరకు సైనిక బలగాల చేతుల్లో 890 మంది ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ సంఘం తెలిపింది. కాగా, జుంటా సైన్యం చేపడుతున్న చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తుంది.