1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (22:33 IST)

అంగారకుడిపై ఎలుగుబంటి.. నిజమేనా?

bears
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపై అధ్యయనం చేసేందుకు వివిధ ఉపగ్రహాలను పంపుతోంది. అంగారకుడిపై జీవం ఉండే అవకాశం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిస్థితిలో, నాసా అంగారకుడిపై ఉన్న రాతిలో ఎలుగుబంటి ముఖంతో కూడిన చిత్రాన్ని ప్రచురించింది. ఈ ఫోటో నాసా ఆర్బిటర్ ద్వారా తీయబడింది. 
 
ఇది అంగారకుడిపై ఉన్న క్రేటర్స్ ఫోటో. ఈ ఫోటోలో రెండు చిన్న గుంటలు కనిపిస్తున్నాయి. అవి సరిగ్గా ఒకే సరళ రేఖలో ఉంటాయి. అవి కళ్లలాంటివిగా కనిపిస్తున్నాయి. 
 
దాని దిగువ భాగంలో పెద్ద రంధ్రం ఉంది. ఇది ఎలుగుబంటి ముఖం లాంటి ఫోటోగా కనిపిస్తోంది. ఈ ఫొటోను నాసా విడుదల చేసింది. దీనిని అధునాతన కెమెరాతో చిత్రీకరించారు. ఇది అగ్నిపర్వతం లేదా మట్టి బిలం కావచ్చునని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. 


Bear
Bear