ఆ మిస్సైల్‌లో అమెరికా దాకా హైడ్రోజన్ అణుబాంబు... భయపెడ్తున్న ఉ.కొ
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ భూమికే ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేయడమే కాదు దాన్ని పరీక్షించి ప్రపంచం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు కిమ్. ఉత్తర కొరియా ఇప్పటివరకూ ఆరు అణు పరీక్షలు నిర్వహ
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ భూమికే ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేయడమే కాదు దాన్ని పరీక్షించి ప్రపంచం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు కిమ్. ఉత్తర కొరియా ఇప్పటివరకూ ఆరు అణు పరీక్షలు నిర్వహించింది. అందులో తాజాగా జరిపిన పరీక్షలో పేలిన అణు బాంబు చాలా శక్తివంతమైనదని తేలింది. దీని పేలుడు కారణంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ ప్రకంపన 6.3గా నమోదైంది. దీనితో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతంలో సైనిక విన్యాసాల పేరుతో బాంబుల మోత మోగించింది. ఈ మోతను విన్న వెంటనే రష్యా కలుగజేసుకుంది. ఉత్తర కొరియాపై ఏమాత్రం దూకుడుగా ప్రవర్తించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. సైనికుల విన్యాసాలను తక్షణమే విరమించుకోవాలని తెలిపింది.
మరోవైపు ఉ.కొ అధ్యక్షుడు మాత్రం అమెరికాను లక్ష్యం చేసుకుంటూ మరికొన్ని మిస్సైళ్లను పరీక్షించే పనిలో వున్నట్లు సమాచారం. ఈ మిస్సైళ్లు తాజాగా విజయవంతమైన హైడ్రోజన్ బాంబును మోసుకెళ్లగలవని ఉ.కొరియా అధికారులు చెప్పడం గమనార్హం. మొత్తమ్మీద పోయేకాలం దగ్గరపడిందా అన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి.