బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (11:28 IST)

నర్సు కాదు కిరాతకురాలు.. నవజాత శిశువులు ఎనిమిది మందిని..?

దేశంలో కాదు.. ప్రపంచ దేశాల్లోనూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా అభంశుభం తెలియని నవజాత శిశువులను ఓ నర్సు పొట్టనబెట్టుకుంది. పురుడు పోయాల్సిన నర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారులను చిదిమేసింది. ఆమె పనిచేస్తున్న దవాఖానలోనే ఇప్పటివరకు ఎనిమిదిమంది నవజాత శిశువులను చంపింది. మరో పది మంది చిన్నారుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నించింది. ఆఖరుకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్టర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక దవాఖానలో లూసీ లెట్ బే అనే నర్సు పనిచేస్తుంది. దవాఖానలో అప్పుడే పుట్టిన చిన్నారులను చంపేస్తున్నదనే అభియోగాలపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
 
2015, జూన్ నుంచి 2016 జూన్ వరకు కౌంటెస్ ఆఫ్‌ చెస్టర్ దవాఖానలోని నియోనటల్ యూనిట్‌లో ఎనిమిది మంది చిన్నారులను చంపేసిందని, మరో పది మంది శిశువులపై హత్యాయత్నం చేసిందని తెలిపారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. గతంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోపణలపై ఆ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఆమెను విడుదల చేయడం గమనార్హం.