శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2017 (12:21 IST)

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధం... తగిన బుద్ధిచెబుతామంటున్న పాక్ ఆర్మీ జనరల్

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు.

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు. 
 
పాకిస్థాన్‌తోక జాడిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా స్పందించారు. 
 
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు తమ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయన్నారు. భారత్ దుస్సాహసానికి దిగితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 
 
భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ అంతా ఒట్టిదేనని ఆయన కొట్టిపడేశారు. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు సిద్ధమన్న భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.