బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:50 IST)

బొద్దింకలను పెంచుతున్న చైనా రైతులు.. ఎందుకు?

చైనాలో ఉన్న రైతులు కాక్రోచ్‌ల పెంపకంపై దృష్టి సారించారు. సాధారణంగా తేనెటీగల పెంపకం మాదిరిగానే కాక్రోచ్‌ల పెంపకంపై కూడా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారట. అంతేకాకుండా ఈ పని చేయడం వారికి బాగా లాభాలను తెచ్చిపెడుతోందట. తక్కువ స్థలంలోనే చైనీయులు కొన్ని బిలియన్ల కీటకాలను ఉత్పత్తి చేస్తున్నారు. 
 
కాక్రోచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, అందుకే వీటి పెంపకం చేపట్టామని చైనా రైతులు తెలిపారు. కాక్రోచ్‌ల పెంపకం చాలా లాభాలు తెచ్చిపెడుతున్నాయని వారు పేర్కొన్నారు. చైనాలో ఉన్న ప్రముఖ హోటళ్లు వీటిని కొనుగోళ్లు చేసి, కొత్తరకం నాన్‌వెజ్ వంటకాలను తయారు చేస్తున్నాయి. దీంతో నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుని మరీ వీటిని తింటున్నారట..!