శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:56 IST)

ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనా? 300 నౌకలు?

ఇతర దేశాలతో చైనా వ్యవహరించే తీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. ప్రపంచదేశాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా ఎప్పుడూ తహతహలాడుతుంటుంది. తాజాగా చైనా చిన్న ద్వీపమైన ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ దీవిని చైనాకు చెందిన దాదాపు 300 నౌకలు చుట్టుముట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. 
 
ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉండే థిటు అనే మరో చిన్న దీవికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చైనాకు చెందిన నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే చైనా మాత్రం అవి చేపలుపట్టే ఓడలని బుకాయిస్తోంది. 
 
తాము ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవడంలేదని చైనా వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఒక్కోసారి భారీ సంఖ్యలో నౌకలు వస్తూ ఉండటంతో ఈ దీవిని చుట్టుముట్టారా అనే వాతావరణం కనిపిస్తోందని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.