ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By

ఐస్‌క్రీమ్ నాకుతూ తినకూడదంటూ ఆంక్షలు.. ఎక్కడ?

సాధారణంగా ఐస్‌క్రీమ్‌ను నాలుకతో నాకుతూ తింటుంటే ఆ మజానే వేరు. కానీ, ఆ దేశంలోని ఓ మున్సిపాలిటీలో మాత్రం ఐస్‌క్రీమ్‌ను నాకుతూ తింటే చట్ట విరుద్ధంగా భావిస్తారు. అది ఎక్కడో కాదు.. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో. ఇస్తాంబుల్‌లోని బాగ్ సిలర్ మున్సిపాలిటీ ప్రారంభించిన ఓ కార్యక్రమం ఇపుడు వివాదాస్పదమైంది. 
 
మహిళకు సంప్రదాయాలను నెలకొల్పేందుకు ఈ మున్సిపాలిటీ రెండు నెలల కోర్సును ప్రారంభించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎలా మెలాగాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, వంట గదిలో పనులు చేయడం లాంటి అంశాలను ఈ కోర్సు ద్వారా నేర్పనున్నారు.
 
దీనికితోడు బహిరంగ ప్రదేశాల్లో ఐస్‌క్రీమ్‌ను నాకుతూ తినకూడదనే నిబంధనను బాగ్ సిలర్ మున్సిపాలిటీ తీసుకొచ్చింది. ఇలా తినడం సభ్యత కాదని తెలిపింది. మహిళలు తమ ముఖాన్ని కప్పుకోకుండా ఇతరులతో మాట్లాడటం తమ సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేసింది. 
 
ఈ మున్సిపాలిటీ నేర్పనున్న కోర్సు సంగతి ఏమోగానీ.. విధించిన ఆంక్షలు మాత్రం ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఐస్‌క్రీమ్ ఎలా తినాలో కూడా మున్సిపాలిటీనే చెబుతుంటా అంటూ పలువురు నెటిజన్లు జోకులు వేస్తున్నారు.