సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (18:47 IST)

పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోరం : 30 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో 40 మందికి గాయాలయ్యాయి. 
 
బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి ర‌జ‌న్‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు. వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ముజ‌ప్ప‌ర్‌గ‌డ్‌లోని డేరాఘాజీ ఖాన్ వ‌ద్ద ఇండ‌స్ హైవేపై ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ను ఢీకొంది. 
 
ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మ‌రో గంట‌న్న‌ర‌లో ఇంటికి చేరుకుంటామ‌న‌గా ఈ ప్ర‌మాదం జరిగింది.