ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (09:53 IST)

భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండవ్.. తేల్చి చెప్పిన పాకిస్తాన్

jaishankar
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగనుంది. ఈ సదస్సుకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరువుతున్నారు. ఈ తరుణణంలో పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. 
 
భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాక్ పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. చర్చలకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జైశంకర్ పర్యటన, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
 
'ఈ పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందింది. షాంఘై సదస్సు సభ్య దేశాల సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన మీ ప్రశ్నకు అక్టోబరు 5వ తేదీన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పర్యటన పాక్షిక కార్యక్రమమని జైశంకర్ చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు వివరణాత్మకమైనవి' అని ముంతాజ్ జహ్రా బలోచ్ ప్రస్తావించారు.
 
కాగా ఇస్లామాబాద్లో జరిగే ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత బృందానికి విదేశాంగమంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెల్సిందే.