మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (16:49 IST)

హాయిగా రోడ్డుపై స్కేటింగ్ చేసిన శునకం.. వీడియో వైరల్ (Video)

Dog
ఓ శునకం హాయిగా స్కేటింగ్ చేసే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా శునకాలు స్కేటింగ్ చేసి ఎవ్వరూ చూసివుండదు. అయితే డాగ్ కూడా స్కేటింగ్ చేస్తుందని ఓ శునకం నిరూపించింది. అలా రోడ్డుపై ఆ శునకం స్కేటింగ్ చేయడాన్ని చూసి అందరూ షాకయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికా మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ రెక్స్ ఛాంప్‌మ్యాన్ ఓ శునకం స్కేటింగ్ చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. దీన్ని చూసి నెటిజన్లు షాకయ్యారు. 36 నిమిషాల నిడివి వున్న ఈ వీడియోలో ఓ శునకం స్కేటింగ్ చేయడం కనిపించింది.
 
రోడ్డుపై వున్న జనాలను చూస్తూ స్కేటింగ్ చేసింది. స్కేటింగ్ బోర్డ్ కాస్త నెమ్మదించడంతో వెంటనే దాని నుంచి కిందకు దిగి.. తర్వాత స్కేటింగ్ బోర్డు ఎక్కింది. ఇక Skater good boy... పేరిట నెట్టింట పోస్టు చేసిన ఈ వీడియోకు భారీ స్పందన వస్తోంది. ఈ వీడియోకు లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.