గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (19:18 IST)

భారత్‌కు రానున్న 500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహం

Hanuman
Hanuman
ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ, భారత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి 500 ఏళ్ల పురాతనమైన హనుమాన్‌ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై 500 ఏళ్లనాటి పురాతన హనుమాన్‌ విగ్రహాన్ని భారత్‌కు అప్పగించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ రూమ్‌లో దీపావళి వేడుకలను నిర్వహించింది. 
 
అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్కృతిని కాపాడేందుకు, దెబ్బతిన్న చారిత్రక భవనాలను రక్షించేందుకు, దొంగతనాలకు గురైనా చారిత్రక సంపదను తిరిగి సంపాదించేందుకు అమెరికా రాయబారులు సహకరిస్తారన్నారు. దీపావళి వంటి వేడుకలను చేసుకొని మతస్వేచ్ఛను తాము చూపిస్తామని బ్లింకెన్‌ తెలిపారు. 
 
దక్షిణ భారత్‌లోని ఓ ఆలయంలోని 500 ఏళ్లనాటి హనుమాన్‌ విగ్రహాన్ని దొంగలించారు. దీనిని ఆస్ట్రేలియా వ్యక్తి కొనుగోలు చేశాడు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తం చేయడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొనేందుకు పూర్తిగా సహకరించారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్ట్రేలియాలో స్వాధీనం చేసుకొన్న ఈ విగ్రహాన్ని అప్పట్లో అమెరికాకు అప్పగించారు. తాజాగా ఇప్పుడు అది భారత్‌కు చేరనుంది.