గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (13:41 IST)

గాంధీ దవాఖానలో బాపూజీ విగ్రహావిష్కరణ

gandhi statue
గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాబ్‌లోని గాంధీ ఆస్పత్రిలో బాపూజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. 
 
ఈ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, ధ్యాన భంగిమలో ఉండే గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25 కోట్ల వ్యయంతో ఆస్పత్రి ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసింది. మొత్తం 16 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది.