స్విస్ బ్యాంకు డేటా వస్తోంది

black money
ఎం| Last Updated: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:49 IST)
విదేశాల్లోని బ్లాక్ మనీని స్వదేశానికి రప్పించేందుకు ఇండియా చేస్తున్న పోరాటం ఫలిస్తోంది. బ్లాక్ మనీ దాచుకున్న వారి వివరాలు ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది.

తొలి విడత కింద బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేసిన వారి వివరాలను ఇవ్వనుంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్విస్ బ్యాంకులు ఈ డేటాను ఇప్పటికే రెడీ చేశాయి. 2018 వరకు యాక్టివ్ లో ఉన్న బ్యాంకు అకౌంట్లు, వాటిల్లోకి వచ్చిన ఫండ్స్ వివరాలను ఇండియాకు ఇవ్వనున్నారు.

విదేశాల్లో అక్రమంగా బ్లాక్ మనీ దాచుకున్నవారిపై విచారణకు ఈ డేటా ఉపయోగపడనుంది. వ్యాపారులు, ఎన్ఆర్ఐల బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. కొన్నేళ్లలో ఈ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డబ్బులు జమ అయ్యాయని, ప్రస్తుతం వాటిని మూసివేశారని వారు తెలిపారు.

ఆటోమెటిక్ ఎక్స్చేంజ్
ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవో) మెకానిజం ద్వారా ఇండియాకు వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. 2018కి ముందు మూసివేసిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి వందల కేసులు ఉన్నాయని,
ఇండియన్ అధికారులు ఆధారాలు అందించడంతో ఈ వివరాలు ఇస్తున్నామన్నారు.

గత నెల ఇండియాలో పర్యటించినస్విస్ ప్రతినిధులు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కు సంబంధించి ఇండియా వినతిని పరిగణలోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్సపరెన్సీ స్టాండర్డ్స్పాటిస్తున్నందునే పన్నులు ఎగ్గొట్టి బ్లాక్ మనీ దాచుకున్నవారిపై ఇండియా చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేస్తున్నామని స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్స్(ఎఫ్డీఎఫ్) తెలిపింది. తొలి విడత కింద అకౌంట్ నంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్,
ఆదాయ వివరాలను అందిస్తామని ప్రకటించింది. ఏటా మరిన్ని వివరాలు ఇస్తామంది.
దీనిపై మరింత చదవండి :