ఆదివారం, 26 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 31 జనవరి 2023 (21:28 IST)

ప్రేమికుల రోజున 9 కోట్ల ఉచిత కండోమ్‌లు.. ఎక్కడ?

Love
వాలెంటైన్స్ డే సందర్భంగా 9.5 మిలియన్ల కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. వాలెంటైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రేమికుల రోజున ప్రేమికులు ఒకరినొకరు కలుసుకుని ప్రేమను పంచుకుంటారన్న సంగతి తెలిసిందే.
 
ఈ పరిస్థితిలో థాయ్‌లాండ్ ప్రభుత్వం వాలెంటైన్స్ డే రోజున 9.5 మిలియన్ల కండోమ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించి చిన్నవయసులోనే లైంగికంగా సంక్రమించే వ్యాధులు, సంతానం కలగకుండా చూడాలని నిర్ణయించింది.
 
లైంగికంగా సంక్రమించే వ్యాధులు, చిన్నవయసులోనే సంతానం కలగకుండా ఉండేందుకు థాయ్ లాండ్ ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునే వారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కండోమ్‌లను వినియోగించుకోవాలి.