శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:15 IST)

వీధికుక్కను ఇంటర్వ్యూ చేసిన నటి.. చివరకు..!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో ఓ వీధి కుక్క కూడా పాల్గొంది. దాంతో అది కూడా సెలబ్రిటీ అయిపోయింది.

ఈ వేడుకలో ఆ కుక్కను ఇంటర్వ్యూ చేయటం కూడా జరిగిపోయింది. ఇటీవల ఐఫా వేడుకలు జరుగుతున్న వేదిక వద్దకు ఓ వీధి కుక్క చొరబడింది. గెస్ట్ ల కోసం ఏర్పాటు చేసిన గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు తచ్చాడటం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఆ కుక్కను గమనించిన నటి అదితి భాటియా దాన్ని దగ్గరకు తీసుకుంది.

ఈ క్రమంలో తన చేతుల్లో ఉన్న మైక్‌ పట్టుకుని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేసింది. కుక్కను నీ పేరేంటి అని పలకరించగానే అది ప్రేమగా ఆమెతో కరచాలనం చేసింది. ఆ తరువాత అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయింది.

కుక్క కదా అలాగే ఉంటది. దాని మౌనాన్ని స్వీకరించిన అదితి కూడా చివరకు సైలెంట్ అయిపోయింది. అయితే ఆ వీధికుక్క ఈ పరిణామంతో సెలబ్రిటీ గా మారిపోయింది. అదితి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. షేర్‌ చేసిన రెండు రోజుల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.