సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 జులై 2021 (21:21 IST)

స్పెయిన్ పార్లమెంట్‌లో ఎలుక.. పరుగులు పెట్టిన సభ్యులు

spain
స్పెయిన్ పార్లమెంట్‌ను ఓ మూషికం పరుగులు పెట్టించింది. స్పెయిన్‌లోని సెవిల్‌లో ఉన్న ఆండలూసియా పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పార్లమెంట్‌లో సీరియస్‌గా మాట్లాడుతున్న స్పీకర్ మార్తా బోస్కెట్ ఆ ఎలుకను చూసి షాక్‌ తిన్నారు. అది గమనించిన మిగిలిన సభ్యులు కూడా సీట్లల నుంచి లేచి పరుగులు తీశారు. 
 
అనంతరం కాసేపటికి ఎలుకను బయటకు తోలేయగా ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులై ఉండి ఎలుకను చూసి భయపడడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు.