శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అమెరికా ఇచ్చిన ఆయుధాలతో రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్

Russian ship
ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర సాగిస్తుంది. అతి చిన్నదేశంగా ఉన్న ఉక్రెయిన్‌ను తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగిన రష్యాకు ఉక్రెయిన్ బలగాలు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా వంటి దేశాలు ఇచ్చిన ఆయుధాలపై ఉక్రెయిన్ సేనలు రెచ్చిపోతున్నారు. తాజాగా రష్యాకు గట్టి షాక్ ఇచ్చాయి. రష్యా యుద్ధ నౌకను ముక్కలు ఉక్రెయిన్ సేనలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. 
 
నల్ల సముద్రంలో స్నేక్ ఐలాండ్‌ సమీపంలో నల్ల సముద్రంలో లంగర్ వేసివున్న రష్యా నౌకపైకి ఉక్రెయిన్ బైరక్టార్ బి2 డ్రోన్ ద్వారా క్షిపణిని విడుదల చేసింది. అది లక్ష్యాన్ని సూటిగా తాకడంతో నౌక ధ్వంసంపై కాలిపోవడాన్ని వీడియో చూడొచ్చు. 
 
స్నేక్ ఐలాండ్ ప్రస్తుతానికి రష్యా నియంత్రణలోనే ఉంది అక్కడ సెర్నా ప్రాజెక్టు ల్యాండింగ్ క్రాఫ్ట్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాకు చెందిన ఈ రెండు క్షిపణి నిరోధక వ్యవస్థలను సైతం బైరక్టార్ బీ2 దెబ్బతీసినట్టు ఉక్రెయిన్ బలగాలు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించాయి.