బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (22:40 IST)

గంజాయి పంట ధ్వంసం

విశాఖపట్నం జిల్లా, జీకేవీధి మండలం జీకేవీధి పంచాయతీలో ఈరోజు పి.కొత్తూరు, ఢీ.కొత్తూరు గ్రామాల్లో 18  ఎకరాల్లో గంజాయి పంటను నరికివేసి కాల్చివేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జీకేవీధి సిఐ ఈ అశోక్ కుమార్ ఎస్ ఐ యస్ సమీర్, హెడ్ కానిస్టేబుల్ వాసు కానిస్టేబుల్ లక్ష్మణ్ మహిళా పోలీసు శాంతి, రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్వో రామారావు అధికారులు పాల్గొన్నారు.

ముందుగా గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ గంజాయి పంట వలన కలిగే దుష్పరిణామాలు తెలియజేసి పంటలను నరికివేసి కాల్చేయడం జరిగింది.