బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 మార్చి 2017 (09:57 IST)

అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి... 15 నెలల తర్వాత వీడిన కేసు మిస్టరీ

అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది.. ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు.

అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది.. ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు.. మృతదేహాన్ని గ్యారేజ్‌లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి.. తన తల్లిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ హత్య గత 2015 డిసెంబరు నెల 17వ తేదీన జరుగగా, ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు... చివరకు మృతురాలి కుమారుడే హంతకుడిగా నిర్ధారించారు. దీంతో ఆమె కొడుకు 17 యేళ్ళ అర్నవ్‌ ఉప్పలపాటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. కాగా, హత్యకు గురైన మహిళ పేరు నళిని తెల్లప్రోలు. వీరు కరోలినాలోని రోలాండ్ గ్లెన్ రోడ్డులూ నివశిస్తూ వచ్చారు.