మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మార్చి 2021 (13:42 IST)

చైనా కట్టడి కోసం పావులు కదపుతున్న అమెరికా!!

ఇటీవలి కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అగ్రరాజ్యం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆసియా దేశాల్లో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. 
 
క్వాడ్‌ కూటమిలోని దేశాధ్యక్షుల సమావేశం ముగిసిన కొన్ని రోజుల్లోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా రక్షణశాఖ మంత్రి (డిఫెన్స్‌ సెక్రటరీ) లాయిడ్‌ ఆస్టిన్‌ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆయన తన పర్యటనను హవాయి నుంచి ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యో, సియోల్‌తో పాటు న్యూఢిల్లీలో కూడా పర్యటించనున్నారు. 
 
అమెరికా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమానార్హం. చైనాను కట్టడి చేసేందుకు ఆసియాలోని మిత్రదేశాలకు సహకరించేలా తన పర్యటన ఉండబోతోందని ఆస్టిన్‌ వెల్లడించారు.
 
'ఈ పర్యటన మిత్రదేశాలు, భాగస్వాముల కోసం. మా సామార్థ్యాలు పెంచుకోవడంపై చర్చిస్తాం. మేము పోటీపడే శక్తి తగ్గింది. కానీ, భవిష్యత్తులో మా పోటీతత్వాన్ని కొనసాగిస్తాం. అంతేకాదు వృద్ధి చేసుకుంటాం కూడా. మా దగ్గర ఆ సామర్థ్యాలు, ప్రణాళికలు ఉన్నాయి. చైనాతో సహా మాకు సవాలు చేసే ఎవరికైనా తగిన సమాధానం ఇవ్వగలమని నిరూపిస్తాం' అని లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.