శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (14:11 IST)

ఆర్టెమిస్-1 తర్వాత జరిగే ప్రయోగాలేంటి?

NASA's Artemis
NASA's Artemis
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని సోమవారం నింగిలోకి పంపిచనుంది. ఆ తర్వాత జరిగే ప్రయాగాలపై అమితాసక్తి నెలకొంది. వచ్చే 2024లో ఆర్టెమిస్-2 యాత్రను నిర్వహించనుంది. ఇందులో నలుగుర వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై కాలుమోపరు. జాబిలి ఉపరితలానిక 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించి అత్యంత ఎక్కువ దూరం ఇదే అవుతుంది. 
 
ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్‌-3 యాత్రకు శ్రీకారం చుడుతారు. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనుంది.
 
ఒరాయన్‌ తొలుత చంద్రుడి కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమవుతుంది. అప్పుడు ఒరాయన్‌లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూ కక్ష్యలోని 'డిపో' నుంచి స్టార్‌షిప్‌నకు ఇంధనం అందుతుంది.
 
ఆ తర్వాత దశలో 'గేట్‌వే' పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేస్తుంది. జాబిలి ఉపరితలానికి చేరుకోవడానికి ముందు వ్యోమగాములు ఇందులో బస చేస్తారు. సుదూర అంతరిక్ష యాత్రలకూ దీన్ని విడిది కేంద్రంగా ఉపయోగించుకుంటారు. 
 
అయితే అపోలోకు, ఒరాయన్‌కు ఉన్న తేడాలను నిశితంగా పరిశీలిస్తే, అపోలో ముగ్గురు ఆస్ట్రోనట్స్‌ను 13 రోజుల యాత్రకు తీసుకెళ్లగలదు. కానీ, ఒరాయన్‌.. నలుగురు వ్యోమగాములను 21 రోజుల యాత్రకు తరలించగలదు.
 
అపోలో క్రూ మాడ్యుల్‌ వ్యాసం 12.8 అడుగులు కాగా, ఒరయాన్ వెడల్పు 16.5 అడుగులు. అపోలో ఆరు అడుగులు కన్నా తక్కువ ఎత్తు ఉన్న పురుషులను తీసుకెళుతుంది. ఒరయాన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్త్రీపురుషులను తీసుకెళుతుంది.