బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (15:37 IST)

ఆఫ్గన్ తాత్కాలిక అధ్యక్షుడుగా అమ్రుల్లా సలేహ్... ఎవరీయన?

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశ అధ్యుక్షుడుగా ఉన్న అష్రాఫ్ ఘనీ దేశం వీడి పారిపోయారు. అప్పటి నుంచి ఆప్ఘన్ దేశ ‘చట్టబద్ధమైన’ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తనను తాను ప్రకటించుకున్నారు.  
 
గత సంవత్సరం ఫిబ్రవరి నుండి ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఈయన కొనసాగుతున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడుగా ఉన్న సలేహ్ ఇపుడు ఆప్ఘాన్ చట్టబద్ధమైన తాత్కాలిక అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
ఈ మేరకు ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ఆధినాయకత్వాన్ని ఉల్లంఘిస్తూ సలేహ్ ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేశారు, దీనిలో "తమ మద్దతు మరియు ఏకాభిప్రాయాన్ని కాపాడుకోవడానికి నాయకులందరికీ చేరువవుతున్నాను" అని చెప్పాడు.